Reading Time: < 1 minute

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఖతర్ పాలకులు విలాసవంతమైన విమానం బహుమతిగా ఇవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది ట్రంప్ కు వ్యక్తిగత బహుమతి కాదని ఖతర్ PM షేక్ మహమ్మద్ బిన్ క్లారిటీ ఇచ్చారు.

రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని పేర్కొన్నారు. రెండు విదేశాంగ శాఖల మధ్య జరిగిన లావాదేవీగానే తాము పరిగణిస్తున్నామని, ప్రస్తుతం ఆ అంశం ఇంకా న్యాయ పరిశీలనలోనే ఉందన్నారు.