class="wp-singular post-template-default single single-post postid-531 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

విశాఖపట్నం:
పోక్సో కేసులో దాదాపు 12 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 2014లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ ఘటనకు సంబంధించి అల్లిపురానికి చెందిన మహమ్మద్ సల్మాన్ ఖాన్పై పోలీసులు అప్పట్లో పోక్సో కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అప్పట్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కండీషనల్ బెయిల్‌పై విడుదలైన సల్మాన్ ఖాన్, ఆ తర్వాత కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నం విడిచి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపుర్‌కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. అక్కడ ముద్దాయిని పట్టుకుని విశాఖకు తీసుకొచ్చారు.

12 ఏళ్లుగా పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి, తిరిగి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగిందని అధికారులు పేర్కొన్నారు.

  • Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
    Reading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 30 వారాల గర్భంతో బాధపడుతున్న మైనర్‌కు అబార్షన్ అనుమతిపై కేంద్ర ప్రభుత్వం, AIIMS తీసుకున్న వైఖరిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమల్య బాగ్చి‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, అబార్షన్ అనేది బాధితురాలు మరియు ఆమె కుటుంబ సభ్యుల నిర్ణయం కావాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని కోర్టు వ్యాఖ్యానించింది. కాలానికి అనుగుణంగా చట్టాలు మారాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అత్యాచార బాధితురాలు అనుభవిస్తున్న మానసిక, శారీరక బాధకు ఏ పరిహారం సరిపోదని అన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి, పౌరుల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సూచించారు. అబార్షన్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరైంది కాదని… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
  • నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
    Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృషభం ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పొందుతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026