class="wp-singular post-template-default single single-post postid-702 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

మనిషి నిద్రలోకి జారుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తుంటాయి. స్వాప్నిక శాస్త్రం ప్రకారం కలలు మన మానసిక స్థితి, ఆలోచనలు, భయాలు, ఆశలు వంటి అంశాలకు ప్రతిబింబాలుగా భావించబడతాయి. కలలో కనిపించే జంతువులు కూడా ప్రత్యేక సూచనలు ఇస్తాయని విశ్వాసం ఉంది. అలాంటి జంతువుల్లో గాడిద ఒకటి. కలలో గాడిద కనిపించడం సాధారణంగా స్పష్టత లేమి, భవిష్యత్తులో ఎదురయ్యే చిక్కులు లేదా మానసిక ఒత్తిడిని సూచిస్తుందని చెబుతారు. అయితే కలలోని సందర్భాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు.

బరువును మోస్తున్న గాడిదను కలలో చూస్తే కష్టపడి, సహనంతో పనిచేసిన తర్వాతే విజయం సాధిస్తారని అర్థం. వ్యాపారం లేదా ప్రేమ సంబంధాలలో ఆలస్యంగా అయినా ఫలితం దక్కుతుందని భావిస్తారు. గాడిద మొండితనానికి ప్రతీకగా భావించబడుతుంది కాబట్టి ఇది వ్యక్తిత్వ లక్షణాలనూ సూచించవచ్చు. ఒకవేళ గాడిదపై నుంచి పడిపోతున్నట్లు కనిపిస్తే ప్రేమలో లేదా వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు ఎదురయ్యే అవకాశముందని చెబుతారు.

గాడిద తన్నినట్లు కల వస్తే మనసులో దాగి ఉన్న భయం లేదా తప్పు చర్యలపై ఆందోళనకు సంకేతమని భావిస్తారు. అయితే గాడిదపై ఊరేగుతున్నట్లు, దాని వెనుక జనాలు వస్తున్నట్లు కనిపిస్తే నాయకత్వ లక్షణాలు పెరిగి ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారని సంకేతంగా తీసుకుంటారు.

గమనిక: పై సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.