class="wp-singular post-template-default single single-post postid-779 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), quality = 82?
Reading Time: < 1 minute

“రైలుబండి నడిపేది పచ్చజెండాలే.. బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే” అనే మాటలలో డబ్బు విలువ స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ ప్రజలు రోజంతా కష్టపడి పని చేసి సంపాదించే ఆ నోట్ల విలువ ఎంత గొప్పదో వారికి బాగా తెలుసు. అయితే పంజాబ్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను వధువు మీద ఎగరేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిబ్రవరి 14న పంజాబ్ రాష్ట్రంలోని తర్న్ తరుణ్ ప్రాంతంలో ఈ వివాహ వేడుక జరిగింది. డీజే సంగీతం, నృత్యాలతో కార్యక్రమం ఘనంగా సాగుతుండగా, వేదికపై నిలబడి ఉన్న వధువుపై అతిథులు భారీగా నగదు కురిపించినట్లు వీడియోలో కనిపిస్తోంది. వధువుకు వరుడి కుటుంబం రూ.8.5 కోట్ల నగదు బహుమతిగా ఇచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలను ఇలా ప్రదర్శనగా వినియోగించడం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు. కొందరు దీనిని “గ్రాండ్ క్యాష్ పార్టీ”గా పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై వరుడి సోదరుడు సికందర్ సింగ్ స్పందిస్తూ, విసిరిన నోట్లన్నీ అసలు కరెన్సీయే అయినప్పటికీ మొత్తం కోట్లు కాదని, కేవలం లక్షల రూపాయలేనని స్పష్టం చేశాడు.