class="wp-singular post-template-default single single-post postid-750 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

Massive Market Fire : బీహార్ రాష్ట్రంలోని బీహార్ లోని కటిహార్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కుర్సెలా లోని షహీద్ చౌక్ స్టేట్ హాట్ మార్కెట్‌లో ఆదివారం సాయంత్రం సుమారు 7:30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఒక బట్టల దుకాణంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే మార్కెట్ అంతటా వ్యాపించి దాదాపు 500 దుకాణాలను బూడిద చేశాయి.

టిన్ మరియు గడ్డితో నిర్మించిన దుకాణాలు వరుసగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, కూరగాయలు, మొబైల్ షాపులు సహా పలు వ్యాపారాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మంటలు వేగంగా వ్యాపించడంతో ఎవరికి స్పందించే అవకాశం కూడా లేకపోయిందని తెలిపారు. అగ్నిజ్వాలలు తీవ్రంగా ఉండటంతో సుమారు 5 కిలోమీటర్ల దూరం నుంచే ఆకాశం ఎర్రగా కనిపించింది.

పరిస్థితి విషమించడంతో నేషనల్ హైవే-31, స్టేట్ హైవే-77 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అధికారులు నిలిపివేశారు. మొదట చిన్న ఫైర్ బ్రిగేడ్ వాహనం మాత్రమే చేరుకోవడంతో మంటలను అదుపు చేయడం కష్టమైంది. తరువాత పెద్ద అగ్నిమాపక వాహనాలు చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో సుమారు రూ.7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. బాధితులకు ప్రభుత్వం సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.