class="wp-singular post-template-default single single-post postid-1322 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారింది. అయితే దీని వెనుక ముఖ్యమైన కారణాల్లో ఒకటి శరీరంలో పోషకాల లోపం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు తక్కువగా ఉండటం వల్ల జుట్టు బలహీనపడుతూ రాలిపోవడం ప్రారంభమవుతుంది.

జింక్ అనే ఖనిజం జుట్టు ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఇది కెరోటిన్ ఉత్పత్తిలో భాగస్వామిగా పనిచేస్తుంది. జింక్ లోపం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి, సులభంగా విరిగిపోతాయి. ఈ సమస్యను తగ్గించేందుకు విత్తనాలు, గుడ్లు వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ డి కూడా జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకంగా గుర్తించబడింది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడటమే కాకుండా తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డి లోపం ఉంటే తల దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

ఇక ఐరన్ లోపం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే జుట్టు బలహీనమై రాలిపోతుంది. దీనిని నివారించేందుకు మునగ, పాలకూర వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

అదేవిధంగా, జుట్టు నిర్మాణానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారి విరిగిపోతుంది. ఆమ్లా, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

ఇంకా, ప్రోటీన్ కూడా జుట్టుకు అత్యంత అవసరమైన పోషకం. జుట్టు ప్రధానంగా ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుంది. కాబట్టి, ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు జుట్టు బలహీనపడుతుంది. దీనిని నివారించేందుకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer : ఈ ఆర్టికల్ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. వ్యక్తిగత సమస్యల కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.