class="wp-singular post-template-default single single-post postid-453 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పాల్వంచ పట్టణంలో ఉన్న అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఎంపిక చేసిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా గదుల ఏర్పాటు, స్థల వినియోగం, అంతర్గత ఏర్పాట్లు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి విభాగానికి కేటాయించే గదులను స్పష్టంగా గుర్తించి, నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

డిస్ట్రిబ్యూషన్ మరియు రిసీవింగ్ ప్రక్రియలు క్రమబద్ధంగా జరిగేలా స్థల ఏర్పాట్లు ఉండాలని, కౌంటింగ్ నిర్వహణకు అనువైన విధంగా సరిపడ స్థలం, వెలుతురు, గాలి ప్రసరణ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.