class="wp-singular post-template-default single single-post postid-617 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనదైన మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ పేరు చెబితేనే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతూ నటించిన తొలి చిత్రం మారెమ్మ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూర్తి గ్రామీణ నేపథ్యంతో రూపొందించారు. ఓ గ్రామానికి శాపం పడినప్పుడు, ఆ కష్టాల నుంచి బయటపడేందుకు మారెమ్మ అనే గ్రామ దేవతకు పూజలు చేసే సంప్రదాయాన్ని కథాంశంగా తీసుకున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో గ్రామీణ వాతావరణం, భక్తి, భావోద్వేగాలు ఆసక్తికరంగా చూపించారు. తొలి సినిమానే అయినప్పటికీ మాధవ్ తన నటనతో ఆకట్టుకుంటున్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపా బాలు నటిస్తోంది. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ప్రశాంత్ ఆర్. విహారి అందిస్తున్నారు. గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.