తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులను ఇవాళ రాత్రి వరకు మాత్రమే క్యూ లైనులోకి అనుమతిస్తామని టీటీడీ వెల్లడించింది. సర్వదర్శనం కోసం తిరుపతిలో ఇవాళ జారీ చేసే దర్శన టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.నిన్న ఒక్కరోజే 83,122 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, హుండీ ద్వారా రూ.4.49 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది. చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి దర్శనాలకు అనుమతించనున్నారు.
Disclaimer : ఈ సమాచారం టీటీడీ విడుదల చేసిన అధికారిక ప్రకటనల ఆధారంగా రూపొందించబడింది. భక్తులు దర్శనానికి ముందు తాజా ప్రకటనలను పరిశీలించడం మంచిది.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…Reading Time: < 1 minuteఅస్సాంలోని పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 19… Read more: Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…





