class="wp-singular post-template-default single single-post postid-397 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

మేషం

సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసే వారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.

వృషభం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. దైవబలం రక్షణగా నిలుస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గాధ్యానం శుభప్రదం.

మిధునం

పనుల్లో ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా వ్యవహరిస్తే మేలు. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపాటు నిర్ణయాలు మానండి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు కొంత కలతను కలిగిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

సింహం

లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు అవసరం. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహారాధన శుభదాయకం.

కన్య

ముఖ్యమైన పనులు ఆలస్యం అయ్యే సూచనలున్నాయి. కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి కృషి అవసరం. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణుసహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

తుల

మంచి మనసుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక బలాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలనిస్తుంది.

వృశ్చికం

శుభ ఫలితాలున్నాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సహాయం లభిస్తుంది. శివారాధన శుభప్రదం.

ధనుస్సు

ఒక వ్యవహారంలో తోటివారి సహాయం లభిస్తుంది. ఇంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయభేదాలు రావచ్చు. దుర్గా స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.

మకరం

దృఢ చిత్తంతో ముందుకు సాగితే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. భోజన సౌఖ్యం లభిస్తుంది. మానసిక ఉల్లాసం పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభదాయకం.

కుంభం

అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవారాధన మానవద్దు.

మీనం

మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)