class="wp-singular post-template-default single single-post postid-501 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

మణుగూరు:
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (TSPEU–1535) ఆధ్వర్యంలో దేశ గణతంత్ర దినోత్సవాన్ని మణుగూరులోని బీటీపీఎస్ ఎదుట ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ బీటీపీఎస్ రీజనల్ అధ్యక్షులు వి. ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే విద్యుత్ శక్తి కీలకమని, విద్యుత్ ఉద్యోగులుగా దేశ అభివృద్ధిలో తమ పాత్ర మరింత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్. రామచందర్, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏ. వెంకటేశ్వర్లు, బి. జార్జ్, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏం. రాజమనోహర్, టీ. ముత్యాలరావు, ఉపాధ్యక్షులు కే. జాన్ రెడ్డి, కే. వీరబాబు, పి. శేఖర్ బాబు, సిహెచ్. వెంకటేశ్వర్లు, ఎం. శ్రీనివాస్, టీ. గోపి, ఏం. రాజ్ లక్ష్మి, రమణ, లలిత తదితరులు పాల్గొన్నారు.