అధిక వడ్డీ ఆశ చూపించి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమాయక ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు భారీగా డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. నల్గొండ జిల్లాలో ఇలాంటి మరో పెద్ద మోసం బయటపడింది. డిండి మండలానికి చెందిన భీమా నాయక్ ఫామ్ ల్యాండ్స్ పెట్టుబడుల పేరుతో వందలాది మందిని మోసం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డిండి మండలం తబలా తండాకు చెందిన భీమా నాయక్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నానని చెబుతూ ప్రజలను నమ్మించాడు. పెట్టుబడి పెడితే లక్ష రూపాయలకు 10 నుంచి 15 శాతం వరకు వడ్డీ ఇస్తానని హామీ ఇచ్చాడు. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో పెద్దవూర మండలం ఫాల్తీ తండాకు చెందిన సుమారు 55 మంది అతడికి దాదాపు రూ.7 కోట్ల వరకు ఇచ్చారు.
మొదట్లో భీమా నాయక్ నెల నెలా వడ్డీ చెల్లించడంతో మరికొంత మంది అతనిపై నమ్మకం పెంచుకున్నారు. కొందరు అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టారు. ఈ విధంగా నల్గొండ జిల్లాలోని సాగర్, హాలియా, పెద్దవూర, డిండి, మిర్యాలగూడ ప్రాంతాలకు చెందిన వందలాది మంది నుంచి భీమా నాయక్ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
ఈ డబ్బుతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్స్ కొనడంతో పాటు విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నెలలుగా వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడంతో పెట్టుబడిదారులు అనుమానం వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో భీమా నాయక్ పరారయ్యాడు.
తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో భీమా నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. బాధితుల్లో ఒక తహశీల్దార్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది.
ఇక నల్గొండ జిల్లాలో ఈ ఏడాది భారీ స్థాయిలో ఆర్థిక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక వడ్డీ పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి మోసం చేసిన ఘటనల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా మోసాలు జరిగినట్లు సమాచారం. ఇదే తరహాలో పలుగు తండాకు చెందిన బాలాజీ నాయక్ కూడా పెట్టుబడుల పేరుతో మూడు వేల మందికి పైగా ప్రజల నుంచి సుమారు రూ.330 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Disclaimer : ఈ కథనం ప్రజలకు సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న ఆరోపణలు దర్యాప్తు ఆధారంగా మారవచ్చు. పూర్తి నిజాలు పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి వస్తాయి.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









