class="wp-singular post-template-default single single-post postid-450 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: 2 minutes

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు

నేతాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన సంఘం సభ్యులు

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెల పంపిణీ

పాల్వంచ: నేతాజీ యువజన సంఘం సేవలు అభినందనీయమని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ సోమరాజు దొర అన్నారు. శుక్రవారం నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో నేతాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు

ఈ సందర్భంగా డాక్టర్ సోమరాజు దొర మాట్లాడుతూ నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రోగులకు పాలు పండ్లు రొట్టెల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. నేతాజీ యువజన సంఘం తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆయన కోరారు.


యువత నేతాజీ యువజన సంఘం సేవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ నామ బుచ్చయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు బుడగం నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ పాల్వంచ పట్టణ ఉపాధ్యక్షుడు భార్గవ్ సాయి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్, పాకాలపాటి కళా పీఠం అధ్యక్షుడు రోశయ్య చౌదరి, న్యూ పాల్వంచ మెగా ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాసిం,నేతాజీ యువజన సంఘం సభ్యులు ఎండి అబ్దుల్ రజాక్, జె.స్టాలిన్, జారే బిక్షం, ఓం ప్రకాష్, ముగిది శ్రీరామ్, మీసాల సత్యం, ఎండి ఆసిఫ్, ఎరువ శ్రీనివాసరావు, శనగ రామచంద్రరావు, ఎండి యూసుఫ్, పి.ప్రసాద్, ఎం.సంతోష్, చిట్టి, రామచందర్ నాయక్, , మస్నా శ్రీనివాసరావు, సాదత్ అలీ, రామినాయుడు, గద్దర్ బాషా, భూక్య శంకర్, శ్రీపాద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.