ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఉదయం అల్పాహారం చాలా ముఖ్యమైనది. రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి శరీరానికి అవసరమైన శక్తిని అందించేది బ్రేక్‌ఫాస్ట్. ముఖ్యంగా ఉదయం పూట ఏమి తింటామన్నది మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కానీ చాలా మంది సమయం లేకపోవడం లేదా అలవాటుగా బ్రేక్‌ఫాస్ట్‌ను దాటవేస్తూ ఉంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఉండడం వల్ల క్రమంగా జీవక్రియ సిండ్రోమ్ అనే సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఒకేసారి కనిపించవచ్చు. ఇవి గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతాయి.
ప్రత్యేకంగా ఉదయం టిఫిన్‌ను తరచుగా దాటవేసే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా మారే ప్రమాదం ఉంది. దీని కారణంగా కళ్లు తిరగడం, బలహీనత, అలసట వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
అల్పాహారం మానేయడం వల్ల శరీర మెటబాలిజం కూడా మందగిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సరిగా జరగక జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. శరీరంలో జీవక్రియ రేటు తగ్గిపోవడం వల్ల శక్తి స్థాయి తగ్గి రోజంతా అలసటగా అనిపించవచ్చు.
అదేవిధంగా ఎక్కువసేపు ఆకలిగా ఉండడం వల్ల మైగ్రేన్ వంటి తలనొప్పి సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ ఉదయం పోషకాహారం కలిగిన అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా తరచూ తలనొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









