ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి రాశి ఫలాలు
మేషం
మీ మీ రంగాల్లో మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
వృషభం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనలతో లాభాలను గడిస్తారు. దుర్గాస్తుతి పఠిస్తే బాగుంటుంది.
మిధునం
శుభఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమ ఫలిస్తుంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి సరైన ఆహార నియమాలను పాటించాలి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణ చేయాలి.
సింహం
ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
కన్య
మనఃస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య, వినోద సుఖం ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
తుల
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృశ్చికం
ఆత్మవిశ్వాసంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. లక్ష్యం నెరవేరుతుంది. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. శ్రీ దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
ధనుస్సు
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది.
మకరం
శరీర సౌఖ్యం కలదు. మనస్సు చెప్పింది చేయండి, శుభం చేకూరుతుంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. రవి ధ్యానం శుభప్రదం.
కుంభం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
మీనం
మనోబలాన్ని కోల్పోవద్దు. మంచిపనులను ప్రారంభిస్తారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









