ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో ప్రజలు వేడి గాలులు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటికి వెళ్లకుండా చాలామంది జాగ్రత్త పడుతున్నారు. అయితే బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే చాలామంది చేసే సాధారణ పని ఫ్రిజ్లోని చల్లటి నీటిని వెంటనే తాగడం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల ప్రకారం, ఎండలో ఎక్కువసేపు తిరిగి శరీరం వేడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా చల్లటి నీటిని తాగడం వల్ల శరీరానికి తగిన సమతుల్యం కోల్పోతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వేడి వాతావరణం నుంచి చల్లటి పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు కొంత సమయం అవసరమని వారు సూచిస్తున్నారు.
ఇక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశమూ ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో తలనొప్పి, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా కనిపించవచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగకుండా కొంతసేపు ఆగడం మంచిదని సూచిస్తున్నారు.
వైద్యుల సలహా ప్రకారం, ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఆగి, శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరిన తర్వాతే నీరు తాగడం మంచిది. అదేవిధంగా వెంటనే ఎయిర్ కండిషన్డ్ గదిలోకి వెళ్లకుండా, కొద్దిసేపు రూమ్ టెంపరేచర్లో ఉండడం శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
మొత్తానికి, వేడి నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగడం కంటే, కొద్దిసేపు ఆగి రూమ్ టెంపరేచర్ నీరు తాగడం ఆరోగ్యానికి ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









