ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి రాశి ఫలాలు
మేషం:
రావలసిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చు అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలసిరావు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి.
వృషభం:
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మిథునం:
బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కర్కాటకం:
అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది.
సింహం:
ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
కన్య:
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలకు లోటు ఉండదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమౌతాయి.
తుల:
పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం:
ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
ధనస్సు:
ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది.
మకరం:
కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం:
చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం:
పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి. వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…
- Train Crime Shock: విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం… వివాహితపై అత్యాచారం… వివరాల్లోకి వెళ్ళితే
- Love Drama : ప్రియుడి కోసం టవర్ ఎక్కి వివాహిత హల్చల్
- Fuel Price Rumours: ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయా? కేంద్రం క్లారిటీ
- TG RTC Salary Update: ఉద్యోగులకు వేతన సవరణ శుభవార్త
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 29, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 29, 2026
- Delivery Crime: డెలివరీ పేరుతో MBA విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కిరాణా వ్యాపారి
- Bus Fight Tragedy: బోర్డు చదవమన్న వివాదం… ప్రాణం తీసిన దాడి…
- Watermelon trazedy : ముంబైలో విషాద ఘటన… పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి…
















