class="wp-singular post-template-default single single-post postid-414 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

రేణుకా మీనన్ ఒక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పనిచేసిన ప్రముఖ హీరోయిన్. ఆమె 2002లో మలయాళం సినిమాతో హీరోయిన్‌గా సినిమాల్లో అడుగుపెట్టింది. 19 ఏళ్ల వయసులోనే మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించింది.

అనంతరం మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుసగా అవకాశం పొందింది. 2004లో ఆనందం ఫేమ్ ఆకాశ్ తో కలిసి ఆనందమానందమాయే అనే తెలుగు సినిమాలో నటించింది.

2006 తర్వాత ఆమె సినిమాలకు దూరమై ఐటీ ప్రొఫెషనల్ సూరజ్‌కుమార్ నంబియార్‌ను పెళ్లి చేసుకుని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయింది.

ఇప్పుడు ఆమె తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో కాలిఫోర్నియాలో నివసిస్తోంది. అక్కడే డ్యాన్స్ స్కూల్ నిర్వహించి, క్లాసికల్ మరియు వెస్ట్రన్ డ్యాన్స్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది.