class="wp-singular post-template-default single single-post postid-340 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాద ఘటన కలకలం రేపింది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

విషయం తెలిసిన యువతి తల్లి ఇద్దరినీ మందలించడంతో పూజ దూరంగా ఉండసాగింది. ఈ క్రమంలో మహేశ్ పెళ్లి చేయాలంటూ బెదిరించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపుల నేపథ్యంలో మంగళవారం ఉదయం పూజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన మహేశ్ బుధవారం ఉదయం బ్రహ్మణపల్లి శివారులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.