class="wp-singular post-template-default single single-post postid-466 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని 60వ డివిజన్‌లో జనసేన పార్టీ బలంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు వెల్లడించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారితో పాటు, నిబద్ధతతో డివిజన్ సమస్యలపై పోరాటం చేయగల సామర్థ్యం ఉన్న కొత్త నాయకులకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ఈ ప్రెస్‌మీట్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ వేముల కార్తీక్, పాల్వంచ మండల అధ్యక్షుడు దేవ గౌడ్, పాల్వంచ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ముగిత్యాల భాస్కర్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ సాదిక్ పాషా, చుంచుపల్లి మండలం ప్రెసిడెంట్ అనిల్, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రెసిడెంట్ మార్గం సందీప్, ఆర్. సాయి అనిత్, భాషా, జిల్లా యువజన నాయకులు గారికే రాంబాబు, ములకపల్లి మండలం ప్రెసిడెంట్ ప్రవీణ్, బాలాజీ, కుశల్ వీర మహిళా నాయకురాలు అనిత తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.