class="wp-singular post-template-default single single-post postid-347 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

వెనెజువెలా వెలికి తీసే చమురును అమెరికాకే విక్రయించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌కు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తెలిపారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ బృందం హెచ్చరించింది.

అలా చేస్తేనే వెనెజువెలాకు మరింత చమురు ఉత్పత్తికి అనుమతి ఇస్తామని పేర్కొంది. అమెరికా ఆయిల్ ట్యాంకర్లు, షిప్పులను బ్లాక్ చేయడంతో నిల్వల సమస్య తలెత్తి, గత నెల నుంచి వెనెజువెలా పలు చమురు బావులను మూసివేస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే ఆ దేశం ఆర్థికంగా దివాళా తీసే ప్రమాదముందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికాతో కలిసి చమురు విక్రయాలు చేపట్టాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోందని మీడియా వెల్లడించింది. ఇదే సమయంలో, అధిక నాణ్యత గల 50 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్ ధరకే అమెరికాకు విక్రయిస్తామని తాత్కాలిక సర్కారు ప్రకటించిందని ట్రంప్ తెలిపారు.