కొందరు ఫోన్ చూస్తూ రాత్రంతా గడిపేస్తుంటారు. కానీ రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల శరీరంలోని కండరాలు, హార్మోన్లు బలహీనపడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పురుషుల లో టెస్టోస్టెరాన్ స్థాయులు 24 శాతం తగ్గుతాయి. కార్టిసాల్ స్థాయులు పెరిగి కండరాల విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. సార్కోపెనియా ముప్పు ఉంటుంది. త్వరగా పడుకుని త్వరగా మేల్కొని వ్యాయామం చేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
