ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మబొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ జాబ్ మేళాలో ఆదిలాబాద్‌తో పాటు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన మొత్తం 67 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 7500 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జాబ్ మేళా ద్వారా 2100 మంది అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకు కార్యక్రమం సందర్భంగా అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రతులను అందజేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం లభించే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, ఏఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి, డీఎస్పీలు జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, శ్రీనివాస్, శిక్షణలో ఉన్న ఐపీఎస్ రాహుల్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









