అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ 185 సమీపంలో ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో మంగళవారం అర్ధరాత్రి 1:20 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 వరకు కార్లు ఉన్నట్లు సమాచారం. షోరూం సర్వీస్ సెంటర్లోని స్క్రాప్ గోదాం నుంచి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు నుంచి ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మంటలను గమనించిన సమీప అపార్ట్మెంట్ నివాసులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని వేగంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యలుగా సమీప అపార్ట్మెంట్లో నివసిస్తున్న సుమారు 90 కుటుంబాలను పోలీసులు ముందస్తుగా ఖాళీ చేయించారు.
ఈ ఘటనకు షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తుండగా, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా షోరూం యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…Reading Time: < 1 minuteఅస్సాంలోని పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 19… Read more: Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…Reading Time: < 1 minuteఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో ప్రజలు వేడి గాలులు, ఉక్కపోతతో ఇబ్బందులు… Read more: Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధానిReading Time: < 1 minuteనరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. ఈ… Read more: Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్యReading Time: < 1 minuteఅహ్మదాబాద్ లో సోషల్ మీడియా కారణంగా సంభవించిన ఘోర ఘటన కలకలం రేపింది.… Read more: Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…Reading Time: < 1 minuteఫరీదాబాద్ లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 18 నెలల చిన్నారి… Read more: Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









