గురుకుల హాస్టళ్లకు నిత్యావసరాలు, కాస్మొటికన్ను సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన సరకులు అందడంతో పాటు మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని భావిస్తోంది. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు చేసేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
