Reading Time: < 1 minute

US అధ్యక్షుడు ట్రంప్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్ లో నిర్వహించిన ఈ విందులో ట్రంప్ తో పాటు ఖతర్ షేక్ ఎమిర్ తమిమ్ బిన్ హమీర్తోనూ ముచ్చటించారు.

ఈ సందర్భంగా ట్రంప్ తో పలు అంశాలపై అంబానీ కాసేపు చర్చించారు. US ప్రెసిడెంట్ గౌరవార్థం ఖతర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందులో టెస్లా అధినేత మస్క్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.