ఆపరేషన్ సిందూర్ తో భారత్ లో కొత్త సిద్ధాంతం ఆరంభమైందని US యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. ఇకపై పాక్ నుంచి ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధం గానే పరిగణించేలా పరిస్థితి ఏర్పడిందన్నారు.
‘పాక్ దాడిని భారత్ ఒంటరిగా ఎదుర్కొంది. వేరే దేశాల దౌత్య పరమైన సాయం కోరలేదు. దీంతో సార్వభౌమాధికారాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకుంది. భారత రక్షణ సామర్థ్యం ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించింది’ అని అన్నారు.
