మణిపుర్ చందేల్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. న్యూ సమతాల్ గ్రామంలో మిలిటెంట్ల కదలికపై సమాచారం రావడంతో అస్సాం రైఫిల్స్ వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చేపట్టింది.
మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని ఆర్మీ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
