Reading Time: < 1 minute

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో ChatGPT, Deep Seek వంటి ప్రజాదరణ పొందిన AI టూల్స్‌ను ఉపయోగించవద్దని హెచ్చరించింది.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ముఖ్యమైన అడ్వైజరీ విడుదల చేసింది. ప్రభుత్వ పరికరాలు, సిస్టమ్స్‌పై ఈ టూల్స్ వినియోగాన్ని పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది.

ప్రభుత్వ డేటా గోప్యత, సమాచార భద్రతకు ముప్పు ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సున్నితమైన లేదా రహస్య సమాచారాన్ని AI టూల్స్‌లో నమోదు చేస్తే అది అనధికారులకు చేరే ప్రమాదం ఉందని పేర్కొంది.

ప్రభుత్వ సమాచారాన్ని రక్షించడం ఉద్యోగుల బాధ్యత అని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సైబర్ నిపుణులు కూడా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను AI టూల్స్‌లో అప్‌లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.