రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు నిర్ణయించడానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇకపై ఈ కమిటీ సిఫారసుల మేరకే మూవీ టికెట్ల ధరలు పెరగనున్నాయి.
హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో సమాచార, ఆర్థిక, న్యాయశాఖల కార్య దర్శులతోపాటు నిర్మాత వివేక్ కూచిభొట్లను సభ్యులుగా చేర్చింది. బెనిఫిట్ షోలకు సంబంధించి ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచనుంది.
