Reading Time: 2 minutes

ఆన్‌లైన్ క్లాసులు వినడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ చేయడం వంటి పనులకు మొబైల్ ఫోన్ కంటే ల్యాప్‌టాప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లల చదువుకోసం తక్కువ బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ రూ.20 వేల లోపు అందుబాటులో ఉన్న, విద్యార్థులకు సరిపోయే బెస్ట్ ల్యాప్‌టాప్‌లపై ఓ లుక్కేద్దాం.

2026లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

Acer Aspire 3

Acer Aspire 3 ప్రస్తుతం రూ.18,990 ధరలో లభిస్తోంది. 11.6 అంగుళాల HD డిస్‌ప్లే, Intel Celeron N4500 ప్రాసెసర్‌తో ఇది ఆన్‌లైన్ క్లాసులు, వెబ్ బ్రౌజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. HD వెబ్‌క్యామ్, 38Wh బ్యాటరీతో సుమారు 1 కిలో బరువు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత.


ASUS Chromebook CX14

రూ.18,990 ధరతో లభించే ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల డిస్‌ప్లే, Intel Celeron ప్రాసెసర్‌తో వస్తుంది. ChromeOSపై పనిచేస్తూ, రోజువారీ స్టడీ పనులకు సరిపోతుంది. 3 నెలల ఉచిత Google AI సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.


Lenovo Chromebook Gen 4

రూ.14,990 ధరలో లభించే ఈ మోడల్ MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 11.6 అంగుళాల HD డిస్‌ప్లే, 720p వెబ్‌క్యామ్‌తో ఇది ఆన్‌లైన్ క్లాసులకు సరైన ఎంపిక.


Primebook 2 Neo

రూ.15,990 ధరతో లభించే Primebook 2 Neo తేలికైన డిజైన్‌తో వస్తుంది. Android ఆధారిత ఇంటర్‌ఫేస్‌తో పాటు Prime OS ద్వారా Linux లేదా Windows డెస్క్‌టాప్ అనుభూతిని ఇస్తుంది.


Reliance Jio JioBook 11

రూ.12,990 ధరలో లభించే JioBook 11 విద్యార్థులకు చౌకైన ఆప్షన్. MediaTek ప్రాసెసర్, Android ఆధారిత సిస్టమ్‌తో ఇది రోజువారీ వినియోగానికి సరిపోతుంది. కేవలం 990 గ్రాముల బరువు, సుమారు 8 గంటల బ్యాటరీ బ్యాక్‌ప్‌తో పోర్టబుల్‌గా ఉంటుంది.

తక్కువ బడ్జెట్‌లో చదువుకు అవసరమైన ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్‌లు విద్యార్థులకు మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.