నిద్ర అనేది శరీరానికి అత్యంత అవసరమైన విశ్రాంతి. నిద్ర సమయంలో శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటూ, మెదడుకు విశ్రాంతిని అందిస్తుంది. అయితే నేటి జీవనశైలిలో చాలా మంది రాత్రి నిద్ర పట్టకపోవడం, మధ్యలోనే నిద్ర చెదిరిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి నిద్ర కోసం సరైన నిద్ర భంగిమను ఎంచుకోవడం చాలా కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, నిద్రించేటప్పుడు ఒక వైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఇది మనస్సును రిలాక్స్‌గా ఉంచి, లోతైన నిద్రకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా ఉండటంతో పాటు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకూ ఈ భంగిమ సురక్షితమైనదిగా వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ భంగిమలో పడుకోవడం వల్ల జీర్ణాశయంలో యాసిడ్స్ సరైన దిశలో పనిచేసి, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి కుడి వైపు తిరిగి పడుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, గుండెపోటు వచ్చే ప్రమాదం కొంతవరకు తగ్గుతుందని వివరించారు.
అలాగే వెన్నెముక సమస్యలు ఉన్నవారికి కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా, సరైన నిద్ర భంగిమను అలవాటు చేసుకోవడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడడంతో పాటు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుReading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలుReading Time: < 1 minuteజ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు; అది సాధన ద్వారా పెంపొందించుకునే నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిదే. సరైన… Read more: Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…Reading Time: < 1 minuteకర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి… Read more: Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణReading Time: < 1 minuteఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో… Read more: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?Reading Time: < 1 minuteఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్… Read more: Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్Reading Time: < 1 minuteవిలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఒక యువకుడిని నేర మార్గం వైపు నెట్టింది. యూట్యూబ్‌లో బైక్ దొంగతనం పద్ధతులు తెలుసుకుని ఖరీదైన వాహనాలను టార్గెట్… Read more: యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలుReading Time: < 1 minuteప్రాచీన భారత దేశపు గొప్ప ఆలోచనాపరుడు, దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన మార్గదర్శకాలు ఉన్నాయి.… Read more: చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు
- మియాపూర్‌లో దుర్ఘటన: యువ నర్స్ ప్రాణాలు తీసుకున్న ప్రేమ వ్యవహారంReading Time: < 1 minuteహైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమైందనే కారణంతో ఓ యువ నర్స్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల… Read more: మియాపూర్‌లో దుర్ఘటన: యువ నర్స్ ప్రాణాలు తీసుకున్న ప్రేమ వ్యవహారం









