బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా మోతీ బిఘా గ్రామంలో ఐదుగురు బాలికలు విషం తాగిన ఘటన సంచలనం సృష్టించింది. జనవరి 29న పొలానికి వెళ్లిన 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ఐదుగురు బాలికల్లో నలుగురు మృతి చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రాణాలతో బయటపడ్డ 14 ఏళ్ల బాలిక వాంగ్మూలం ప్రకారం, “విషం రుచి ఎలా ఉంటుందో చూద్దాం” అని ఒక స్నేహితురాలు చెప్పడంతో కొంగలను చంపడానికి ఉపయోగించే విషాన్ని నీటిలో కలిపి తాగారని తెలిపింది. తాను కొద్దిగా తాగి ఉమ్మివేయడంతో బతికానని పేర్కొంది.
ఇదిలా ఉంటే, పోలీసులు మరో కోణాన్ని వెల్లడించారు. సరస్వతి పూజ సమయంలో కొంతమంది అబ్బాయిలతో తిరిగినందుకు తల్లిదండ్రులు మందలించడంతో బాలికలు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, బాలికల తల్లిదండ్రులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, పిల్లలు చిన్నవయసులో ఉన్నారని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
