Reading Time: < 1 minute

క్రూ-11 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను జనవరి 8న నిర్వహించనున్నట్లు నాసా ముందుగా ప్రకటించింది.

వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ సుమారు 6.5 గంటల పాటు స్పేస్‌వాక్ చేయాల్సి ఉండగా, చివరి నిమిషంలో నాసా దీనిని నిలిపివేసింది. క్రూ-11 మిషన్‌లో పాల్గొన్న ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో స్పేస్‌వాక్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ, మిషన్‌ను ముందుగానే ముగించాలని నిర్ణయించింది.

వాస్తవానికి ఫిబ్రవరిలో మిషన్ పూర్తవాల్సి ఉండగా, అత్యవసర పరిస్థితుల కారణంగా ఒక నెల ముందే వ్యోమగాములను భూమికి తీసుకురానున్నట్లు నాసా తెలిపింది. అయితే గోప్యత, భద్రతా నిబంధనల కారణంగా ఆ వ్యోమగామి పేరు లేదా వైద్య వివరాలను వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి