దేశంలో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్‌లో కొనసాగుతున్న క్రాష్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ధరలు మరింతగా దిగజారుతున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక అనిశ్చితి, అలాగే US Federal Reserveకు త్వరలో కొత్త ఛైర్మన్‌ను ప్రకటించనున్నారనే సంకేతాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు తగ్గుతుండటంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిస్తుండగా, డిజిటల్ గోల్డ్ మరియు గోల్డ్ ETFలలో పెట్టుబడులు పెట్టినవారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ధరలు తిరిగి పెరిగితే లాభాలు బుక్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు (10 గ్రాములు)
హైదరాబాద్:
24 క్యారెట్లు – రూ.1,53,170
22 క్యారెట్లు – రూ.1,40,390
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్లు – రూ.1,53,160
22 క్యారెట్లు – రూ.1,40,390
చెన్నై:
24 క్యారెట్లు – రూ.1,52,170
22 క్యారెట్లు – రూ.1,39,490
బెంగళూరు:
24 క్యారెట్లు – రూ.1,53,160
22 క్యారెట్లు – రూ.1,40,390
ఢిల్లీ:
24 క్యారెట్లు – రూ.1,53,310
22 క్యారెట్లు – రూ.1,40,540
వెండి ధరలు (కిలో)
ఢిల్లీ – రూ.2,99,900
హైదరాబాద్ – రూ.2,99,900
చెన్నై – రూ.2,99,900
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
