Reading Time: 2 minutes

బంగారం, వెండి ధరల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. సెకన్ సెకన్‌కు రేట్లు మారుతుండటంతో ఇన్వెస్టర్లతో పాటు సాధారణ కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇటీవల భారీగా కుప్పకూలిన ధరలు మంగళవారం నుంచి మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. బుధవారం కూడా గోల్డ్ ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించగా, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి.

అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ డీల్ కుదరడం, స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ పెరగడం, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,53,940గా ఉంది. మంగళవారం ఈ ధర రూ.1,53,930గా నమోదైంది.
22 క్యారెట్ల గోల్డ్ ధర ప్రస్తుతం రూ.1,41,110 వద్ద ట్రేడవుతోంది (నిన్న రూ.1,41,100).

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,940గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,110గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,680గా నమోదైంది. మంగళవారం ఈ ధర రూ.1,55,670గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.1,42,710గా ఉంది (నిన్న రూ.1,42,700).

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,940గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల రేటు రూ.1,41,110గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,090గా ట్రేడవుతుండగా, మంగళవారం ఇది రూ.1,54,080గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,41,260గా ఉంది.

వెండి ధరలు ఇవే..

బుధవారం వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,79,900గా ఉంది. మంగళవారం ఇది రూ.2.80 లక్షలుగా నమోదైంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,99,900గా ఉంది. నిన్న రూ.3 లక్షల వద్ద ట్రేడైంది.
విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,99,900గా ఉంది. మంగళవారం రూ.3 లక్షలుగా నమోదైంది.

బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,79,900గా కొనసాగుతోంది. నిన్న రూ.2.80 లక్షలు.

అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులు, డాలర్ కదలికలు, స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా రానున్న రోజుల్లో గోల్డ్, సిల్వర్ ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.