Reading Time: < 1 minute

హైదరాబాద్ మరియు శివారు ప్రాంతాల్లో మత్తు పదార్థాల అక్రమ స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నిందితులు అన్వర్ హుస్సేన్ (చింతల్‌మెట్) మరియు బుర్ర సంపత్ (బండ్లగూడ)గా గుర్తించారు. పోలీసులు వీరిపై విచారణ జరుపుతున్నారు, వారికి ఎక్కడి నుండి డ్రగ్స్ వచ్చాయి, సరఫరా చేసినవారు ఎవరన్నది పరిశీలిస్తున్నారు.

విచారణ తర్వాత నిందితులను రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి, మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్నారు.