Reading Time: < 1 minute

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులను ఆకర్షించేందుకు మరో చౌక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ జియోఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

ఈ ప్లాన్‌లో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. డేటా విషయానికొస్తే రోజుకు 100 ఎంబీ చొప్పున మొత్తం 2.8 జీబీతో పాటు అదనంగా 200 ఎంబీ కలిపి 3 జీబీ డేటా అందుతుంది. వ్యాలిడిటీ కాలంలో 50 ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు.

రోజువారీ డేటా పూర్తయ్యాక కూడా 64 kbps వేగంతో ఇంటర్నెట్ కొనసాగుతుంది. అయితే ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కాదు. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు జియో 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ప్లాన్‌ను అందిస్తోంది.