కొత్తగూడెం:
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని, పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు.
శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 232 మంది లబ్ధిదారులకు సుమారు రూ.2.32 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫాలో ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాల సమయంలో తల్లిదండ్రులు అప్పుల పాలవకుండా ప్రభుత్వం అందిస్తున్న రూ.1,00,116 ఆర్థిక సాయం కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక్క రోజులోనే ఐదు మండలాలకు చెందిన ప్రజలకు ఈ స్థాయిలో నిధులు విడుదల కావడం నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డుగా నిలుస్తుందని కూనంనేని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, తహసీల్దార్లు పుల్లయ్య, శిరీష, కృష్ణ, కృష్ణప్రసాద్, సిపిఐ నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, యూసుఫ్, తోట రాజు, మాచర్ల శ్రీనివాస్, పొదిలి శ్రీనివాస్, మూడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పుReading Time: 2 minutesభారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతుంటారు. రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతంగా… Read more: Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుReading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలుReading Time: < 1 minuteజ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు; అది సాధన ద్వారా పెంపొందించుకునే నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిదే. సరైన… Read more: Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…Reading Time: < 1 minuteకర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి… Read more: Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణReading Time: < 1 minuteఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో… Read more: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?Reading Time: < 1 minuteఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్… Read more: Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్Reading Time: < 1 minuteవిలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఒక యువకుడిని నేర మార్గం వైపు నెట్టింది. యూట్యూబ్‌లో బైక్ దొంగతనం పద్ధతులు తెలుసుకుని ఖరీదైన వాహనాలను టార్గెట్… Read more: యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలుReading Time: < 1 minuteప్రాచీన భారత దేశపు గొప్ప ఆలోచనాపరుడు, దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన మార్గదర్శకాలు ఉన్నాయి.… Read more: చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు









