Reading Time: < 1 minute

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గ్రామ సమీపంలోని ONGC గ్యాస్ బావిలో అకస్మాత్తుగా లీక్ జరగడంతో క్రూడ్ ఆయిల్ కలిసిన గ్యాస్ భారీగా ఎగజిమ్మింది. బావి మరమ్మత్తుల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్యాస్ గ్రామమంతా వ్యాపించి తెల్లటి మేఘాల్లా కమ్మేయగా, కొద్దిసేపటికి మంటలు చెలరేగి భారీ అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. భద్రతా చర్యలుగా గ్రామాన్ని ఖాళీ చేయించి ప్రజలను సమీప కళ్యాణ మండపానికి తరలిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ONGC సాంకేతిక బృందాలు లీక్‌ను నియంత్రించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.