Reading Time: < 1 minute

మహా శివరాత్రి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరలకు నేటి నుంచి 17వ తేదీ వరకు 330 ప్రత్యేక బస్సులు నడపనుంది.

సికింద్రాబాద్, ఈసీఐఎల్, అమ్ముగూడ, ఉప్పల్ నుంచి కీసరగుట్టకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే సీబీఎస్, పటాన్‌చెరు నుంచి ఏడుపాయల, బీరంగూడకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. వివరాలకు 9959226160 సంప్రదించవచ్చు.