Reading Time: < 1 minute

మెదక్ జిల్లాలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఓ దారుణ హత్యకు దారి తీసింది. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు విద్యుత్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కొడుకు శ్రీకాంత్ పెళ్లి, వ్యవసాయ అప్పుల కారణంగా తండ్రితో తరచూ గొడవ పడేవాడు.

సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన లక్ష్మయ్యను డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా వాగ్వాదం జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ కర్రతో తండ్రి తలపై కొట్టాడు. తీవ్రగాయాలైన లక్ష్మయ్యను ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.