Reading Time: < 1 minute

పాల్వంచ, జనవరి 23,2026

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ, ఈరోజు ఉదయం 7 గంటలకు గాజులగూడెం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన భట్టు వీరు నాయక్, డివిజన్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ విస్తృత ప్రచారం చేశారు.