Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
సుమారు మూడు దశాబ్దాలు తరువాత పాల్వంచలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 44వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న చెరుకుపల్లి సూర్య కిరణ్ అలియాస్ రవి ఉన్నాను అనీ స్థానికంగా ఉన్న నిన్న జరిగిన వజ్రా హోటల్ సమావేశంలో కార్యక్రమంలో సమన్వయకర్త తుళ్లూరు బ్రహ్మయ్య గారి తన ప్రతిపాద వ్యక్తి సంబంధించిన ఈ సందర్భంలో ఈ సందర్భంగా తను మాట్లాడుతూ…. గత 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక కార్యక్రమాలు దగ్గరుండి చేయించడం జరిగింది అదేవిధంగా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని నమ్మినవారికి మోసం జరగదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ ఇదే సందర్భంగా పార్టీ పెద్దలకు సమన్వయకర్తలకు ఆయన చేసిన సూచనలు ఏమిటంటే పార్టీ కేటాయించేటప్పుడు దశాబ్ద కాలం క్రిందట పార్టీ నిర్వీర్యంగా ఉన్నప్పుడు పార్టీకి జవ సత్వాలు తీసుకురావడానికి కృషి చేసింది ఎవరు? పార్టీ అధికారంలోకి కృషి చేసింది ఎవరు? పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పార్టీలోకి వచ్చింది ఎవరు? అనే విషయాలు నిశితంగా పరిశీలించి విచక్షణతో కూడిన నిర్ణయం పార్టీ తీసుకుంటుందని నిర్ణయం తీసుకోవాలని కోరారు.