Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ

ఓటర్ మహాశయులారా,
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 44వ డివిజన్ గాంధీనగర్, శ్రీనగర్ ప్రజలారా…
మీ అమూల్యమైన ఓటుతో సీపీఐ అభ్యర్థి వీసంశెట్టి విశ్వేశ్వర రావు (విశ్వం) గారిని ఘనవిజయం చేయండి.

44వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని హామీ ఇస్తున్నాం. మేడికుంట చెరువును సుందరీకరించి, వాకింగ్ ట్రాక్, పార్క్ ఏర్పాటు చేసి, మురుగు నీరు లేకుండా అందమైన బతుకమ్మ చెరువుగా అభివృద్ధి చేస్తాం.

శ్రీనగర్–గాంధీనగర్ ప్రాంతంలో బొడ్డురాయి ప్రతిష్టిస్తాం. ముత్యాలమ్మ గుడుల పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేస్తాం. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం.

గాంధీనగర్, శ్రీనగర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తాం. 44వ డివిజన్‌లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తాం. సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం.

ముస్లిం, క్రైస్తవ సోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. పేద ఒంటరి మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, కుట్టు మిషన్లు అందించి స్వయం ఉపాధికి మార్గం చూపుతాం.

గెలిపిద్దాం సీపీఐని…
కంకి కొడవలి గుర్తుపై ఓటు వేయండి…
వీసంశెట్టి విశ్వేశ్వర రావు గారిని కార్పొరేటర్‌గా పంపిద్దాం.