Reading Time: < 1 minute

విశాఖపట్నం:
పోక్సో కేసులో దాదాపు 12 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 2014లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ ఘటనకు సంబంధించి అల్లిపురానికి చెందిన మహమ్మద్ సల్మాన్ ఖాన్పై పోలీసులు అప్పట్లో పోక్సో కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అప్పట్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కండీషనల్ బెయిల్‌పై విడుదలైన సల్మాన్ ఖాన్, ఆ తర్వాత కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నం విడిచి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపుర్‌కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. అక్కడ ముద్దాయిని పట్టుకుని విశాఖకు తీసుకొచ్చారు.

12 ఏళ్లుగా పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి, తిరిగి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగిందని అధికారులు పేర్కొన్నారు.

  • ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
    Reading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు శరీరం లోని అనేక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మొదటగా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగితే కడుపులోని ఆహార అవశేషాలు సులభంగా కరిగి బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చాలా మంది ఉదయం కడుపు సరిగా శుభ్రం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ అలవాటు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపించడంలో కూడా గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయి. ప్రతిరోజూ గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
    Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అయిన తర్వాత విశాఖపట్నం నుంచి భోగాపురం వైపు ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రోడ్లు మరియు ట్రాఫిక్ పరిస్థితులు చూస్తే విశాఖ నుంచి భోగాపురం చేరుకోవడం ప్రయాణికులకు కష్టంగా మారే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు నాలుగు గంటల ముందే బయలుదేరాల్సి వచ్చే పరిస్థితి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. విశాఖ నగరంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వేగవంతమైన కనెక్టివిటీ కల్పించేలా వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం 15 రహదారులను అభివృద్ధి చేయాలని ప్రణాళికలో ఉన్నప్పటికీ,… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..