Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం:
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి గెస్ట్ హౌస్‌లో సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు, జీఎంతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

సింగరేణిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీతో సింగరేణి వ్యవహారాలపై చర్చ మరింత ఉత్కంఠగా మారగా, ప్రస్తుతం ఇది రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.