ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి రాశి ఫలాలు
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి.
వృషభం : (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)
వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మిధునం : (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
బంధువర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.
సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి.
కన్య : (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
తుల : (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.
వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.
ధనస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు.
మకరం : (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది.
కుంభం: (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మీనం :(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
ఇవి కూడా చదవండి
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పుReading Time: 2 minutesభారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతుంటారు. రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతంగా… Read more: Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుReading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలుReading Time: < 1 minuteజ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు; అది సాధన ద్వారా పెంపొందించుకునే నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిదే. సరైన… Read more: Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…Reading Time: < 1 minuteకర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి… Read more: Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…





