తెలంగాణలో టైఫాయిడ్ జ్వరం జనాల ప్రాణాలపైకి వస్తోంది. కలుషిత తాగునీరు, ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్న కల్తీ ఫుడ్ కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలవుతుండగా, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టైఫాయిడ్‌తో చనిపోతున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు తెలంగాణ వాసులే కావడం కలకలం రేపుతోంది.
2023లో దేశవ్యాప్తంగా టైఫాయిడ్, పారా టైఫాయిడ్ కారణంగా 1,075 మంది మృతి చెందగా, అందులో 202 మంది తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం. ఈ విషయాలను తాజాగా Registrar General of India విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.
దేశంలో రెండో స్థానం.. యూపీ తర్వాత తెలంగాణ నే… జనాభా పరంగా తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ, టైఫాయిడ్ మరణాల్లో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 2023లో అత్యధికంగా 377 టైఫాయిడ్ మరణాలు నమోదై మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 202 మరణాలతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. పంజాబ్‌లో 118 మంది, ఢిల్లీలో 36 మంది టైఫాయిడ్ కారణంగా మృతి చెందారు.
దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతం మాత్రమే అయినప్పటికీ, టైఫాయిడ్ మరణాల్లో రాష్ట్ర వాటా 19 శాతానికి చేరుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదవుతున్న మొత్తం టైఫాయిడ్ కేసుల్లో దాదాపు ఐదో వంతు తెలంగాణలోనే నమోదు అవుతున్నాయి.
స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం, మురికివాడల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్ల పక్కన దుమ్ము ధూళిలో అమ్మే పానీపూరి, బజ్జీలు, ఇతర జంక్ ఫుడ్ తినడం వల్లే టైఫాయిడ్ వ్యాప్తి పెరుగుతోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు డ్రైనేజీ నీటితో కలిసిపోవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, స్లమ్ ఏరియాల్లో ఈ సమస్య మరింత తీవ్రమైందని చెబుతున్నారు.
సొంత వైద్యం ప్రమాదమే
జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాంతకంగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారం, పది రోజులైనా జ్వరం తగ్గకపోయినా అశ్రద్ధ చేస్తే టైఫాయిడ్ బ్యాక్టీరియా ముదిరి పేగులకు రంధ్రాలు పడటం, ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడం వంటి సీరియస్ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
వారం కంటే ఎక్కువగా జ్వరం కొనసాగడం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
చివరి దశలో ఆసుపత్రికి చేరితే నోటి ద్వారా వేసుకునే మందులు పనిచేయక, హైడోస్ సెలైన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందని, అప్పటికే అవయవాలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పుReading Time: 2 minutesభారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతుంటారు. రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతంగా… Read more: Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుReading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలుReading Time: < 1 minuteజ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు; అది సాధన ద్వారా పెంపొందించుకునే నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిదే. సరైన… Read more: Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…Reading Time: < 1 minuteకర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి… Read more: Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణReading Time: < 1 minuteఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో… Read more: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?Reading Time: < 1 minuteఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్… Read more: Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్Reading Time: < 1 minuteవిలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఒక యువకుడిని నేర మార్గం వైపు నెట్టింది. యూట్యూబ్‌లో బైక్ దొంగతనం పద్ధతులు తెలుసుకుని ఖరీదైన వాహనాలను టార్గెట్… Read more: యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలుReading Time: < 1 minuteప్రాచీన భారత దేశపు గొప్ప ఆలోచనాపరుడు, దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన మార్గదర్శకాలు ఉన్నాయి.… Read more: చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు









