Reading Time: < 1 minute

వెనిజులా రాజధాని కారకాస్‌పై జరిగిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. వెనిజులాపై జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ అమెరికానే నిర్వహించిందని ఆయన అంగీకరించారు.

దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను కూడా అమెరికా దళాలు బంధించి అమెరికాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక Truth Socialలో పోస్ట్ చేశారు.

శనివారం ఉదయం అమెరికా దళాలు కారకాస్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు నిర్వహించాయి. కీలక భవనాలు, పోర్టులపై మిస్సైళ్లు, బాంబులతో దాడులు జరిగాయని వెనిజులా ప్రభుత్వం తెలిపింది.

ఈ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికా చర్యలను వెనిజులా భూభాగంపై జరిగిన తీవ్రమైన సైనిక దురాక్రమణగా మదురో ఖండించారు. కారకాస్‌తో పాటు మిరాండా, అరగువా, లా గుయిరా రాష్ట్రాల్లో కూడా దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.